English | Telugu

జూలై 3 న ఆవారా కార్తీక్ పెళ్ళి

జూలై 3 న "ఆవారా" హీరో కార్తీక్ పెళ్ళి చేసుకుంటున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ తమిళ హీరో "గజిని" ఫేం సూర్య సోదరుడు కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తమిళంలో కార్తీ నటించిన చిత్రాలు "యుగానికొక్కడు", "ఆవారా" పేర్లతో తెలుగులోకి అనువదింపబడి ఘనవిజయం సాధించాయి. ఆ యువ హీరో కార్తీకి త్వరలో పెళ్ళి కాబోతుంది. రంజని అనే అమ్మాయితో అతని తల్లి దండ్రులు కుదిర్చిన సంబంధం అతన్ని పెళ్ళిమంటపానికి దారితీసేలా చేస్తూంది. కార్తీ తన వివాహాన్ని సింపుల్ గా జరుపుకుందామన్నా, అతని పేరెంట్స్ బలవంతం మీద వైభవంగా జరుపుకోవాల్సి వస్తుందని అన్నాడు. మాయ మాటలు కాకపోతే సినీ హీరో పెళ్ళి ఎలా సింపుల్ గా జరుగుతుందండీ.

కార్తీకి కాబోయే భార్య రంజని చెన్నై స్టెల్లా మేరీస్ కాలేజీలో సాహిత్యంలో పట్టభద్రురాలైంది. ఆమె అందులో గోల్డ్ మెడల్ సాధించింది. ప్రేమ వివాహాలకన్నా పెద్దల కుదిర్చిన వివాహాన్నే తాను నమ్ముతాననీ, తాను రంజనితో ఓ అరగంట పాటు మాట్లాడాననీ, ఆమెతో తన జీవితం సాఫీగా సాగిపోతుందన్న నమ్మకం కలిగిందనీ యువహీరో కార్తీ అన్నాడు. వీరి వివాహం జూలై మూడవ తేదీన, తమిళనాడులోని ఈరోడ్ లో ఘనంగా జరుగనుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.