English | Telugu

రాజమౌళి మూవీలో సెకెండ్ హీరోగా నితిన్

రాజమౌళి మూవీలో సెకెండ్ హీరోగా నితిన్ సెకెండ్ హీరోగా నటించనున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే అలుపెరుగని పోరాట యోధుడు గజని మహమ్మద్ లా యువ హీరో ఎన్ని ఫ్లాపులొచ్చినా ఓపిగ్గా హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కానీ అతని సినీ కెరీర్ లో హిట్ అనే మాట వినపడి సంవత్సరాలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన నితిన్ అతని సినిమాల్లో నటించటానికి తెగ ప్రయత్నం చేస్తుంటాడట.

పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాలో కూడా వేషం కోసం ప్రయత్నిస్తే ఆ క్యారెక్టర్ కాస్తా అడవి శేషుకి వెళ్ళిపోయింది. అలాంటి స్థితిలో ఉన్న నితిన్ కి రాజమౌళి సినిమాలో సెకెండ్ హీరో వేషం అనగానే ఎగిరి గంతేశాడు. ఈ సినిమాలో మెయిన్ హీరోగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు. భారీ గ్రాఫిక్స్ తో కూడిన ఈ జానపద చిత్రం సుమారు 100 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ తదితరులు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం నవంబర్ లో ప్రారంభం కానుంది. బహుశా తెలుగు సినీ చరిత్రలో ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంతవరకూ రాలేదు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.