English | Telugu

‘ఓజీ’ షోలో విషాదం.. ‘పుష్ప2’ ఘటన రిపీట్‌ అయిందా?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘ఓజీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా హై బజ్‌ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న సెప్టెంబర్‌ 25 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజే చూసెయ్యాలన్న క్రేజ్‌ ఫ్యాన్స్‌లో ఉంటుంది. క్రౌడ్‌ ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ ఘటన ‘ఓజీ’ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. భద్రాచలంలోని ఏషియన్‌ థియేటర్‌లో ఓజీ సినిమా ప్రదర్శన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. అభిమానులు అధిక సంఖ్యలో థియేటర్‌లోకి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో స్పీకర్లు కింద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి. కెపాసిటీకి మించి సుమారు 1200 మందిని లోపలికి అనుమతించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, లోపల ఉక్కిరిబిక్కిరి అయ్యామని అభిమానులు ఆరోపిస్తున్నారు. థియేటర్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో గత ఏడాది విడుదలైన ‘పుష్ప2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్ళిపోయి కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్ళీ జరగకుండా థియేటర్‌ యాజమాన్యం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.