English | Telugu
కమల్ హాసన్..అనుష్క ఒక్కటేనా!!
Updated : Oct 29, 2015
అనుష్క ని కమల్ హాసన్, విక్రమ్ లతో పోల్చుతున్నాడు తమిళ నటుడు ఆర్య. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో వేడుకలో ఆమెని పొగడ్తలతో ముంచెత్తాడు. అనుష్క డెడికేషన్‌కు ఫిదా అయిపోయానంటున్నాడు. సైజ్ జీరో కోసం బరువు పెరగడం, సన్నబడడం, నటనపై తనకున్న డెడికేషన్ చూసి పడిపోయాడట. తన దృష్టిలో కమల్, విక్రమ్ ల డెడికేషన్ కలిస్తే అనుష్క అని, ఇలాంటి నటిని తానెక్కడా చూడలేదని అన్నాడు. ఒక పాత్ర కోసం ఇంత పెద్ద సాహసం చేయడం అనుష్కకే చెల్లిందని.. అనుష్క కష్టం వృథాగా పోదని చెప్పాడు. అందుకే మంచి నటిగా తెలుగు, తమిళ భాషల్లో ఇంత పేరు సంపాదించిందని అన్నాడు. సైజ్ జీరో సూపర్ హిట్టైతే అనుష్క పడ్డ శ్రమకు మంచి ఫలితం వుంటుంది.