English | Telugu

'పీకే' పెంచేసాడు..!

అమీర్‌ఖాన్ 'పీకే' టీజర్ బయటకొచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు తో చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన అమీర్, తాజా టీజర్ తో అంచనాలను రెట్టింపు చేశాడు. సినిమాలోవున్న అమీర్ గెటప్స్ అన్నింటినీ టీజర్ లో చూపించారు. టీజర్ లో అమీర్‌ఖాన్ గెటప్‌లు, హావభావాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. మొత్తమ్మీద, 'పీకే' అమీర్ కెరీర్ లో మరో ప్రయోగాత్మక చిత్రమని టీజర్ చూసి చెప్పొచ్చు. అమీర్ కు '3 ఇడియట్స్' బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకుడు. అమీర్ తో అనుష్క శర్మ జోడిగా కట్టింది. డిసెంబర్ 19 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.