English | Telugu

వంద కోట్లు ‘పీకే’సిందట..!

అమీర్‌ తాజా చిత్రం ‘పీకే’కి విపరీతమైన పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల మార్కుని చేరిపోయింది. ఇంకా క్రిస్మస్‌ హాలిడేస్‌ మొదలు కానే లేదు. కానీ పికె టికెట్ల కోసం జనం పోటీలు పడిపోతున్నారు. అంటే ఈ జోరు మరో వారం రోజుల పాటు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు వందల కోట్ల మార్కుని దాటడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి లాంగ్‌ రన్‌ ఉంటుందా, మూడు వందల కోట్ల మార్కుని కూడా అందుకుని కొత్త రికార్డు నెలకొల్పుతుందా లేదా అనేదే ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఇప్పుడు నంబర్‌వన్‌ హీరో తనే అని అమీర్‌ఖాన్‌ ఇంకోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు.