English | Telugu
మహేష్ ని ఖుషీ చేసిన 'ఆగడు'
Updated : Sep 10, 2014
'ఆగడు' సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని వంద శాతం నమ్మకంగా వున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ సినిమాకి డబ్బింగ్ పూర్తిచేసిన మహేష్ ఫైనల్ వెర్షన్ చూసి ఫుల్ ఖుషీగా అయ్యాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు మహేష్. ఒక సినిమా పూర్తి చేసిన తరువాత నా కేరియార్ లో ఇప్పుడున్న౦త సంతోషంగా ఎప్పుడూ లేను. ‘ఆగడు’ తన కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందని, ఇలాంటి సినిమాని తనకు ఇచ్చినందుకు శ్రీనువైట్ల కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎనర్జిటిక్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన ‘ఆగడు’ సినిమాపై తనకు భారీ అంచనాలున్నాయని పేర్కొన్నాడు మహేష్. మహేష్ బాబు, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా 19న విడుదలకు సిద్ధమవుతోంది.