English | Telugu

సిల్వర్ స్క్రీన్ మీదకి యువరాజ్ సింగ్..ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు మళ్ళీ 

విడిగా చూస్తే సినిమా వేరు క్రికెట్ వేరుగా కనపడతాయి గాని, రెండింటిలోను పోరాటం సక్సెస్ అనేవే ప్రమాణం. అవి ఉంటేనే రాణించగలుగుతారు. ఆ రెండిటిని బ్యాలన్స్ చేసుకుంటూ ఎంతో మంది క్రికెటర్లు స్టార్స్ గా ఎదిగారు. అందుకే వాళ్ళ జీవిత చరిత్ర గురించి కొన్ని సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఈ కోవలో యువ రాజ్ సింగ్ (yuvraj singh) కూడా చేరబోతున్నాడు.

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టి సిరీస్(t siris)యువరాజ్ బయోపిక్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించబోతోంది ఈ మేరకు అధినేతలైన భూషణ్ కుమార్,రవి బాగ్ చందక్ లు అధికారకంగా వెల్లడించారు.దీంతో ఏ హీరో యువరాజ్ క్యారక్టర్ లో చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఏర్పడింది బాలీవుడ్ సినీ సమాచారం మేరకు ఒక బడా హీరో నే యువరాజ్ బయోపిక్ లో చెయ్యబోతున్నాడని అతి త్వరలోనే వివరాలన్నీ బయటకి వస్తాయనే మాటలు వినిపిస్తున్నాయి. అదే విధంగా బయోపిక్ ని ఏ యాంగిల్ లో చెప్పబోతున్నారనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. ఎందుకంటే యువరాజ్ క్రికెట్ జీవితమే ఒక పోరాటం. కాన్సర్ భారిన పడిన యువరాజ్ దాంతో పోరాడి మళ్ళీ క్రికెట్ ఆడాడు. ఆడటమే కాదు భారీ స్కోర్లని సాధించి ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచాడు.ఇక బయోపిక్ వార్త సోషల్ మీడియాలో వస్తుండంతో యువ రాజ్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక యువి కెరీర్ ని ఒక్కసారి పరిశీలిస్తే 2000 వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ యవనిక లో అడుగుపెట్టి 17 ఏళ్ళ పాటు భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ ని గెలిచినప్పుడు జట్టులోనే ఉండి బాగా రాణించాడు. 2019 లో ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలకగా 40 టెస్టులు, 300 కి పైగా వన్డే లు ఆడాడు.ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి వరల్డ్ రికార్డుని కూడా సాధించాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.