English | Telugu

సినిమాలు కంటే ఎవరెస్ట్ ఎక్కడం మరింత కిక్ ఇచ్చింది.. నటి అర్చనా సింగ్

తెలుగులో ఆమె పేరు ఇంకా పాపులర్ కాలేదు కానీ... తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ అమ్మాయి పేరు సుపరిచితమే. 'బిజినెస్ మేనేజ్మెంట్'లో మాస్టర్స్ (ఎం.బి.ఎ) చేసి, సినిమాలు చేస్తూనే సాహసాలు సైతం చేస్తుండే ఈ చిన్నదాని పేరు "అర్చనా సింగ్". కన్నడ కాంతామణి అయిన అర్చనా సింగ్ ఇటీవల హిమాలయాల్లోని "ఎవరెస్ట్ బేస్ క్యాంప్"లో పాల్గొని తన తెగువను చాటి చెప్పింది. జీవితంలోనూ సమున్నత శిఖరాలు చేరుకోవడం తన లక్ష్యమని చెప్పకనే చెప్పింది.

ఎం.బి.ఎ. పట్టభద్రురాలైన అర్చనా సింగ్... సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే... "విప్రో, ఐ.టి.సి. గ్రూప్ ఆఫ్ హోటల్స్'తోపాటు... కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్ లైన్స్"లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసింది. కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ అందలరాశి... తెలుగులో "దమయంతి - కౌశిక్ వర్మ" చిత్రంలో నటించి మెప్పించింది. "మై ఫాదర్ - మై హీరో" అనే చిత్రంతో మలయాళంలోనూ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రం ఇంగ్లీషులోనూ తెరకెక్కుతుండడం విశేషం. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యురాలైన అర్చన... వీలు కుదిరనప్పుడల్లా "డాన్స్ షోస్" కూడా ఇస్తుంది. కన్నడతోపాటు హిందీ, ఉర్దు, ఇంగ్లీష్ భాషల్లో సాధికారికంగా మాట్లాడగలిగే ఈ చిన్నదానికి తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి పట్టుంది.

ఇటీవల తను చేపట్టిన "ఎవరెస్ట్ బేస్ క్యాంప్" గురించి ఈ "సాహస కన్య" మాట్లాడుతూ... "కెరీర్ బిగినింగ్ లో నేను చేసిన ఉద్యోగాలు, తర్వాత వరసగా దక్షిణాది భాషలన్నింట్లో నేను చేస్తున్న సినిమాలు ఇచ్చిన కిక్ కంటే... ఎవరెస్ట్ ఎక్కడం నాకు మరింత కిక్ ఇచ్చింది. జీవితంలో ఇంకా హైట్స్ కు చేరుకోవాలనే పట్టుదలను, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నాకు తెలియకుండానే నాలో ఏ మారుమూలో దాక్కుని ఉన్న బెరుకును, భయాన్ని ఈ సాహస యాత్ర పటాపంచలు చేసింది. ఈ అనుభవాన్ని, అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం" అని పేర్కొంది. నటన విషయానికి వస్తే... తెలుగులోనూ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని అర్చనా సింగ్ చెబుతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.