English | Telugu
వార్-2 మూవీ ఓటీటీ అప్డేట్!
Updated : Sep 19, 2025
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. భారీ అంచనాలతో ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టి, ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ఉందనుకున్న ఈ సినిమా.. కనీసం రూ.500 కోట్లు కూడా రాబట్టలేక చేతులెత్తేసింది. (War 2 OTT)
రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. 'వార్-2'తో పాటు విడుదలైన 'కూలీ' మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ, 'వార్-2' ఓటీటీ అప్డేట్ మాత్రం ఇంకా అధికారికంగా రాలేదు. మెజారిటీ హిందీ సినిమాలు థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలోకి అడుగుపెడుతుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం ఆరు వారాలకే ఓటీటీ ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు 'వార్-2' కూడా ఆరు వారాలకే స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది అంటున్నారు.
'వార్-2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఆరు వారాల అగ్రిమెంట్ ప్రకారం, సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వినిపిస్తోంది. ఈ డేట్ మిస్ అయితే మాత్రం.. అక్టోబర్ 9కి ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 'వార్-2' ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.
మరి థియేటర్లలో నిరాశపరిచిన 'వార్-2' మూవీ.. ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.