English | Telugu

హనుమన్ జయంతి రోజున ఫ్యాన్స్ కి అరుదైన కానుక ఇచ్చిన చిరంజీవి 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ విశ్వంభర(Vishwambhara).సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకుడు కాగా,యువి క్రియేషన్స్ పై వంశీకృష్ణారెడ్డి,ప్రమోద్ చిరు కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి హనుమాన్(Hanuman)జయంతి సందర్భంగా ఆస్కార్ విన్నర్ కీరవాణి(Keeravani)సంగీత సారథ్యంలో రూపొందిన 'రామరామ'(Rama Raama)సాంగ్ రిలీజ్ అయ్యింది.చిరంజీవిపై పిక్చరైజేషన్ చేసిన ఈ సాంగ్ రాముడి గొప్పతనాన్ని హీరో చెప్తుండటంతో పాటుగా,తమతో పాటు హనుమంతుడిని కూడా గొంతు కలపమని కోరుతున్నాడు.రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం సాంగ్ ట్యూన్ కి తగ్గట్టు అద్భుతంగా ఉంది.రాముడు,హనుమంతుడి భక్తులలో పూర్తి భక్తి భావాన్ని నింపడంతో పాటు ఈ సాంగ్ ఒక కానుక అని చెప్పుకోవచ్చు.లెజండ్రీ సింగర్ శంకర్ మహదేవన్(Shankar Mahadevan)తో కలిసి లిప్సిక ఆలపించడం జరిగింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.