English | Telugu

ప్రవింకూడు షాపు మూవీ రివ్యూ

మూవీ: ప్రవింకూడు షాపు
నటీనటులు: బసిల్ జోసెఫ్, సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్, చాందీని శ్రీధరన్ తదితరులు
ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ
మ్యూజిక్: విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ: షిజూ ఖాలిద్
నిర్మాతలు: అన్వర్ రషీద్
దర్శకత్వం: శ్రీరాజ్ శ్రీనివాసన్
ఓటీటీ: సోని లివ్

బాసిల్ జోసెఫ్, సౌరభ్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మపయాళ మూవీ ' ప్రవింకూడు షాపు'. ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక సోని లివ్ లోకి వచ్చేసింది. తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ:

బాబు(శివజిత్) కి ఒక అడవిలో కల్లు దుకాణం ఉంటుంది. ఆ షాపులో ఒక రాత్రి వర్షం కురుస్తుండగా పదకొండు మంది కల్లు తాగుతుంటారు. తెల్లవారిన తరువాత చూస్తే ఆ షాపులో 'ఉరితాడు'కి బాబు వ్రేళ్లాడుతూ ఉంటాడు. ఈ కేసును ఛేదించడం కోసం పోలీస్ ఆఫీసర్ సంతోష్ (బాసిల్ జోసెఫ్) రంగంలోకి దిగుతాడు. కల్లు దుకాణం మొత్తం చూసిన సంతోష్ కి బాబు ఆత్మహత్య చేసుకోలేదనీ, అతనిని ఎవరో హత్య చేసి, ఆత్మహత్యలా చిత్రీకరించడానికి ప్రయత్నించారనే విషయం అర్థమవుతుంది. బాబులాంటి వాడిని చంపడానికి ఒక వ్యక్తి బలం సరిపోదనీ, హంతకుడికి మరొకరు సాయం చేసి ఉండొచ్చునని భావిస్తాడు. బాబు చనిపోయిన సమయంలో 'కల్లు దుకాణం'లో ఉన్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటాడు. ఒక్కొక్కరి వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆ పదకొండు మందిలో ఉన్న సునీ (చంబన్ వినోద్ జోస్), కన్నా (సౌబిన్ షాహిర్) లపై సంతోష్ కి డౌట్ వస్తుంది. వాళ్లిద్దరు మాత్రమే కాకుండా, ఇందులో 'మెరిండా' (చాందిని) పాత్ర కూడా ఉండొచ్చునని అనుమానం కలుగుతుంది. అసలు కన్నా, సునీపై సంతోష్ కి అనుమానం రావడానికి కారణం ఏమిటి? మెరిండా ఎవరు? ఆమెకి బాబుతో ఉన్న సంబంధమేమిటి? ఈ కేసు విషయంలో సంతోష్ స్పెషల్ ఫోకస్ పెట్టడానికి కారణం ఏమిటనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ కథంతా అడవిలోని ఆ కల్లు పాకలో రాత్రి ఏం జరిగిందనే అంశం చుట్టూ తిరుగుతుండటంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో కామెడీకి ప్రాధాన్యత ఇవ్వడంతో కథ స్లోగా సాగుతున్న ఫీల్ వస్తుంది. కథలో ఫస్టాఫ్ లో ఉత్కంఠను రేకేతించే అంశాలు పెద్దగా లేకపోయినా, కాస్త బోర్ అనిపించినా ఓపికతో చూడాలి. ఎందుకంటే వీటికి చివరి క్లైమాక్స్ కి లింక్ చేశాడు దర్శకుడు.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలను ఇంట్రెస్టింగ్ గా హ్యాండిల్ చేయడం అంత సులువు కాదు. కానీ ఈ తరహా కథలను ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఎక్కువగా చూస్తుంటారు. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా, లొకేషన్స్ ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. సన్నివేశాలకు లొకేషన్స్ మరింత బలాన్ని చేకూరుస్తాయి. సినిమాలో ఫస్టాఫ్ చాలా స్లోగా , నాన్ లీనియర్ గా సాగుతుంది. సెకెండాఫ్ ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది.

అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అశ్లీల దృశ్యాలు ఎక్కడా లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంది. ఇన్వెస్టిగేషన్ కాస్త స్లోగా సాగినా చివరికి ఏం అవుతుందనే క్యూరియాసిటి ఉంటుంది. షిజూ ఖాలిద్ సినిమాటోగ్రఫీ బాగుంది. షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. విష్ణు విజయ్ మ్యూజిక్ ఒకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

బాసిల్ జోసెఫ్, సౌరభ్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్, శివజిత్ పాత్రలను మలచిన తీరు బాగుంది. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : డీసెంట్ థ్రిల్లర్ విత్ స్లో ఫేజ్డ్ కామెడీ. వన్ టైన్ వాచెబుల్

రేటింగ్: 2.5 / 5

✍️. దాసరి మల్లేశ్

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.