English | Telugu
ఆ హీరోయిన్‌తోనే విశాల్ పెళ్లి.. నిజమెంత?
Updated : Aug 8, 2023
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కి సుపరిచితమైన హీరోల్లో విశాల్ ఒకరు. పందెం కోడి నుంచి విశాల్ తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తూ వస్తున్నారు. సినిమాల విషయాన్ని పక్కకు పెడితే విశాల్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఆయన పెళ్లి వార్త ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఎందుకంటే విశాల్ ఇప్పటికే నాలుగు పదుల వయసును ఎప్పుడో దాటేశాడు. హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకనో ఇద్దరూ విడిపోయారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటున్నారు.
ఆ తర్వాత అర్జున్ రెడ్డిలో నటించిన అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లి పీటలు ఎక్కుతారు అని అనుకున్న తరుణంలో మళ్లీ అనీషా రెడ్డితో విశాల్ ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయ్యింది. అందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆ తర్వాత విశాల్ నడిగర్ సంఘంలో పోటీ చేయటం, సామాజిక సేవకు సంబంధించిన విషయాలు మాత్రమే బయటకు వచ్చాయి. కానీ విశాల్ పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం రావటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి విశాల్ మ్యారేజ్‌కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా ఓ హీరోయిన్‌తో.
ఇంతకీ విశాల్ పెళ్లి చేసుకోబోతుందన్నట్లు వార్తల్లో నిలిచిన హీరోయిన్ ఎవరో కాదు.. లక్ష్మీ మీనన్. ఈమె విశాల్ తో పాటు కార్తి సహా కొంత మంది హీరోలతో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది. ఈ మధ్య ఆమె సినిమాల్లో నటించటం లేదు. అయితే ఇప్పుడు లక్ష్మీ మీనన్ వార్తల్లో నిలుస్తోంది. మరి ఈ వార్తలను ఎవరూ ఖండించలేదు. ఇప్పుడు విశాల్ మార్క్ ఆంటోని సహా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.