English | Telugu

విజయ్, తరుణ్ భాస్కర్.. ఎనిమిదేళ్ల తర్వాత కలుస్తున్నారు!

'పెళ్ళి చూపులు' వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తో సోలో హీరోగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. 'పెళ్ళి చూపులు' తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి ఘన విజయాలతో స్టార్ గా ఎదిగిన విజయ్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మరోవైపు తరుణ్ భాస్కర్ కూడా 'పెళ్ళి చూపులు' తర్వాత 'ఈ నగరానికి ఏమైంది'తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన తరుణ్.. గతేడాది దర్శకుడిగా మూడో సినిమా 'కీడా కోలా' చేశాడు. ఇలా సినీ పరిశ్రమలో ఈ ఇద్దరూ ఎవరికివారు తమ మార్క్ చూపిస్తున్నారు. అలాంటి ఈ ఇద్దరు త్వరలో సెకండ్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ కోసం తరుణ్ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. తరుణ్ చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన విజయ్.. సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు వినికిడి. నిజానికి 'కీడా కోలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే విజయ్ మాట్లాడుతూ.. త్వరలో తరుణ్ తో సినిమా చేస్తానని చెప్పాడు. స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు తెలిపాడు. మరి అదే కథతో ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారా? లేక మరో కొత్త కథతో చేయబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా, రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత తరుణ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 'పెళ్ళి చూపులు' సినిమా 2016 లో వచ్చింది. అంటే ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత విజయ్-తరుణ్ రెండో సినిమా కోసం చేతులు కలుపుతున్నారన్నమాట.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.