English | Telugu

పురుషః నుంచి వెన్నెల కిషోర్ పోస్టర్ రిలీజ్.. ఇంతకీ ఆ కిటికీ వద్ద ఏం జరుగుతోంది?

భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా ఇచ్చే కిక్కే వేరేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చేస్తూనే డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ చేపడుతూ ఆడియన్స్ దృష్టిని లాగేస్తున్నారు మేకర్స్.

ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ‘పురుష:’ మూవీ టీమ్ వదులుతున్న పోస్టర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే.. పెళ్లి తర్వాత జీవితంలో భార్యల ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారని ఇప్పటికే విడుదల చేసిన టీజర్ స్పష్టం చేసింది. ఇక తాజాగా మరో డిఫరెంట్ పోస్టర్ వదిలి సినిమాపై ఇంకాస్త హైప్ పెంచేశారు.

తాజాగా వదిలిన ఈ పోస్టర్ లో వెన్నెల కిషోర్ ఏదో అయోమయంలో పడినట్లు కనిపిస్తుండగా.. కిటికీ దగ్గర ఏం జరిగింది అని పోస్టర్ పై రాసి ఇంకాస్త క్యూరియాసిటీ పెంచారు. మొత్తానికి ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ఖచ్చితంగా ఫుల్ ఫన్ ఉంటుందని, అలాగే డిఫరెంట్ సీన్స్ ఆడియన్స్ ఈ సినిమాలో చూడబోతున్నారని స్పష్టమవుతోంది.

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విడుదలైన ప్రతి పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. మరోవైపు ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మగజాతి గర్వించదగ్గ ఆణిముత్యాలండీ మీరు అంటూ ప్రతి సీన్ లో కామెడీ టచ్ ఉండేలా ఈ టీజర్ కట్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల పని చేస్తుండగా.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం