English | Telugu

తరుణ్, లావణ్య వివాదంపై వరుణ్ రియాక్షన్!

కొద్దిరోజులుగా టాలీవుడ్ లో రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య (Lavanya) వివాదం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు హీరోయిన్ మాల్వి మల్హోత్రా (Malvi Malhotra)తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని, అందుకే తనను దూరం పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. కానీ రాజ్ తరుణ్ మాత్రం లావణ్య ఆరోపణలను ఖండించాడు. లావణ్య బిహేవియర్ నచ్చక తాను ఎప్పటినుంచో దూరంగా ఉంటున్నానని, ఆమెకి డ్రగ్స్ అలవాటు కూడా ఉందని ఆరోపించాడు. ఇలా ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ల పలు ఆడియో క్లిప్ లు సైతం లీకయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై వరుణ్ సందేశ్ (Varun Sandesh) స్పందించాడు.

ఆగష్టు 2న విడుదల కానున్న 'విరాజి' (Viraaji) మూవీ ప్రమోషన్స్ లో తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్, లావణ్య వివాదం వరుణ్ సందేశ్ స్పందించాడు. "రాజ్ తరుణ్, లావణ్య లతో నాకు పరిచయముంది. అయితే వారిని కలిసి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. అప్పట్లో వారి ఇంటి సమీపంలో ఉన్నప్పుడు.. నేను, నా భార్య అప్పుడప్పుడు వారిని కలిసేవాళ్ళం. అయితే మేము కలిసి చాలాకాలం అవుతుంది కాబట్టి.. ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దానిపై ఐడియా లేదు. పైగా ఈ ఇష్యూ కోర్టులో ఉంది. కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు." అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు.