English | Telugu

మెగా హీరో 'కంచె' మొద‌లెట్టాడు

ముకుంద సినిమాతో తెర‌పైకి వ‌చ్చిన మెగా హీరో.. వ‌రుణ్‌తేజ్‌. ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. వ‌రుణ్ - క్రిష్ క‌ల‌యిక‌లో ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రానికి శ్రీ‌కారం చుట్టింది. ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని నానాక్‌రామ్ గూడా హౌస్ సెట్‌లో ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి కంచె అనే టైటిల్ ఖ‌రారు చేశారు. రెండో ప్ర‌పంచ యుద్దం నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఇది. దేశ‌భ‌క్తి, ప్రేమ‌, రొమాన్స్‌... ఈ అంశాల నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. వ‌రుణ్ తేజ్ ప‌క్క‌న ప్ర‌గ్వాజైస్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మిర్చిలాంటి కుర్రాడు సినిమాలో క‌థానాయిక‌గా చేసిన ప్ర‌గ్వా ఓ మోడ‌ల్ కూడానూ. త్వ‌ర‌లోనే కంచె రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లెడ‌తారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.