English | Telugu

మెగాస్టార్ కి పోటీగా ఉస్తాద్!

ఈ ఏడాది ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అదే 'భోళా శంకర్'. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ సినిమాకి పోటీగా ఓ కుర్ర హీరో తన సినిమాని విడుదల చేయనుండటం ఆసక్తికరంగా మారింది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీ‌ సింహా కోడూరి 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత చేసిన 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాలతో మాత్రం నిరాశపరిచారు. అయితే ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ జూలై 7న 'భాగ్ సాలే'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అలాగే నెలరోజులకే ఆగస్టులో మరో సినిమాతో రానున్నారు.

శ్రీ‌ సింహా, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా ఫణిదీప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్'. వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ఎత్తు నుంచి కిందకు చూడలేని వ్యక్తి.. ఏకంగా పైలట్ అయ్యి విమానం నడిపే స్థాయికి ఎలా ఎదిగాడనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా, టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమాని ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఒక్కరోజు తేడాతో ఏకంగా మెగాస్టార్ సినిమాకి పోటీగా విడుదలవుతున్న ఈ 'ఉస్తాద్' చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.