English | Telugu

ఓటీటీలోకి ఒకేసారి రెండు క్రేజీ సినిమాలు!

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఇటీవల చిన్న సినిమాలుగా విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకొని.. మంచి విజయం సాధించిన సినిమాలుగా 'ఆయ్', 'కమిటీ కుర్రోళ్ళు'ను చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేరోజు ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం.

11 మంది యువ నటులను ప్రధాన పాత్రల్లో పరిచయం చేస్తూ య‌దు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు' (Committee Kurrollu). ఆగ‌స్ట్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా 90s బ్యాచ్ ఈ మూవీలోని సీన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో మంచి వసూళ్లతో సత్తా చాటిన 'కమిటీ కుర్రోళ్లు'.. ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో ఈరోజు(సెప్టెంబర్ 12) నుంచి స్ట్రీమ్ అవుతోంది.

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం 'ఆయ్' (Aay). జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి అంజి కె. మణిపుత్ర దర్శకుడు. ఆగస్టు 16 థియేటర్లలో అడుగుపెట్టిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. ఘన విజయం సాధించింది. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.