English | Telugu

పవన్ కళ్యాణ్ గెలుపు వెనుక నేనే కాకుండా ఇంకో వ్యక్తి ఉన్నాడు 

సీతారామం, మహానటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా మారిన దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఈ నెల 31 న 'లక్కీ భాస్కర్'(lucky baskhar) గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సితార ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా హిట్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి(venky atluri)దర్శకుడుగా వ్యవహరిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది.

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ప్రముఖ హీరో విజయ్ దేవర కొండ తో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్(trivikram)ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ మూవీలో ఒక కీలక పాత్రలో చేస్తున్న జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది(hyper aadi)త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ గారి డైలాగులు వినే సినిమాల్లోకి వచ్చాను.రచన గురించి వర్ణించాలంటే త్రివిక్రమ్ గారికి ముందు, త్రివిక్రమ్ గారి తర్వాత అని వర్ణించవచ్చు.ఆయన సినిమాల్లోని డైలాగులు చాలా మంది జీవితాల్లో మార్పులు తెచ్చాయి. ఆయనంత గొప్పగా డైలాగులు రాయాలంటే అవతల కూడా త్రివిక్రమ్ అయ్యి ఉండాలి.

ఎన్టీఆర్(ntr)గారు చెప్పినట్టు త్రివిక్రమ్ గారు చాలా అరుదైన వ్యక్తి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అంతకు మించి వేరే అప్షన్ లేదు. రామాయణ, భారత, భాగవత ల మీద పట్టు ఉన్న త్రివిక్రమ్ గారికి ఒక సినిమా ఎలా తెరకెక్కించాలో మరొకరు చెప్పాల్సిన పని లేదు.పవన్ కళ్యాణ్(pawan kalyan)అన్ని కష్టాలని దాటుకొని కొన్ని లక్షల మంది అభిమానుల సపోర్ట్ తో ఎలా అయితే ఎన్నికల్లో గెలిచారో ఒక ఫ్రెండ్ గా ఆయన విజయంలో త్రివిక్రమ్ గారి సపోర్ట్ కూడా అంతే ఉందని చెప్పుకొచ్చాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.