English | Telugu

తీన్ మార్ చాలా తృప్తినిచ్చింది - త్రిష

"తీన్ మార్" చిత్రం తనకు చాలా తృప్తినిచ్చింది అని ప్రముఖ హీరోయిన్ త్రిష మీడియాకు తెలిపింది. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అందాల త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రానికి మణిశర్మ చక్కని సంగీతం అందించారు.

ఈ చిత్రంలో నటించటం గురించి హీరోయిన్ త్రిష మాట్లాడుతూ తానింతవరకూ నటించిన చిత్రాలన్నింటిలోని పాత్రల్లో "తీన్ మార్" చిత్రంలోని మీరా పాత్ర చాలా ప్రత్యేకమైనదనీ, ఆ పాత్రలో నటించినందుకు తనకు చాలా తృప్తిగా ఉందనీ, అలాంటి చిత్రాలూ, అలాంటి పాత్రలు నూటికో కోటికో వస్తాయనీ త్రిష అన్నారు. త్రిష ఇంకా ఈ పాత్ర గురించి తెలియజేస్తూ తమిళంలో "ఉన్నైతాండి వరువాయో"( తెలుగులో ఏమాయ చేసావె) చిత్రంలోని పాత్ర తర్వాత తనకు బాగా నచ్చిన పాత్ర ఈ "తీన్ మార్" చిత్రంలోని మీరా పాత్రనీ, ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు తమ చిత్రం యూనిట్ తరపున కృతజ్ఞతలనీ కూడా త్రిష అన్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.