English | Telugu

వాడుకున్నోళ్లకి వాడుకున్నంత


పవన్ కళ్యాణ్.. ఆయన పవరేంటో అందరికన్నా ఎక్కువ యంగ్ హీరోలకి బాగా తెలుసు అనిపిస్తోంది. ఆయన పేరో, పాటో, డైలాగో, లేకపోతే కనీసం ఆయన చేతుల మీద ఏదో ఒక ప్రమోషన్ అయినా చాలని ఫిక్స్ అయిపోతున్నారు. పవన్ పేరు జోడిస్తే చాలు పబ్లిసిటీ వచ్చి పడిపోతుంది, అలాంటిది ఆయన పేరు మీద ఒక ప్రమోషన్ సాంగ్ తయారు చేసి మరి పబ్లిసిటీకి వాడలనుకుంటున్నారు ఈ మెగాహీరో. వై.వి.యస్. చౌదరి నిర్మాతగా, పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘రేయ్’చిత్రం లో ఈ ప్రయోగం చేయబోతున్నారు. ఈ ఐడియా ఎవరిదైనా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ మొదటి సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో మరి.
ఇదిగో అదిగో అంటున్న ఈ చిత్ర విడుదలకు ఈ పాటతో క్రేజ్ సంపాదించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ గురించి చంద్రబోస్‌తో ఆల్‌రెడీ పాట రెడీ చేయించారట. ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌లో ఈ పాట విడుదల చేస్తారని సమాచారం. 'రేయ్' సినిమా విడుదల ఆలస్యం అవుతున్న కొద్ది మెగా కాంపౌండ్ నుంచి ఒత్తిడి పెరుగుతోందట నిర్మాతకు. ఈ నేపథ్యంలో ఈ పాట ద్వారా నయినా విడుదల చిక్కుల నుంచి రేయ్ సినిమా బయటకు వచ్చి తెర మీదకు వస్తుందేమో చూడాలి. నితిన్ సినిమాలో సాంగ్, బ్రహ్మానందం కొడుకు గౌతమ్ సినిమా 'బసంతి' ఆడియో లాంచింగ్, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమాలో ప్రమోషన్ సాంగ్... ఏమైనా పవన్ పవర్‌ని ఇలా వాడేసుకుంటున్నారు.


ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.