English | Telugu

ప్రముఖ నటికి కాబోయే భర్త ఆత్మహత్య.. ఆ వీడియోలో ఏముంది?

హైదరాబాద్ లో సినీ నటి సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ కి చెందిన సోహాని కుమారికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సవాయ్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. జూలైలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్‌లో ఇరువురు కలిసి ఉంటున్నారు. అయితే తాజాగా తాము నివాసముంటున్న ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు సవాయ్. బయటకు వెళ్ళిన సోహానీ.. ఇంటికి తిరిగి వచ్చేసరికి సవాయ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సవాయ్ సింగ్‌.. ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడు. గతంలో చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. మరోవైపు పోలీసుల ప్రాథమిక విచారణలో.. సవాయ్ సింగ్‌ మాజీ ప్రేయసిని మరిచిపోలేకపోతున్నాడని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని.. అందుకే సూసైడ్ చేసుకొని ఉంటాడని సోహాని కుమారి చెప్పినట్లు సమాచారం.

కాగా, సోహాని కుమారి టాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఇప్పుడిప్పుడే సినీ రంగంలో ఎదుగుతున్న ఆమె.. కాబోయే భర్త సూసైడ్ తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.