English | Telugu

పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' రీరిలీజ్.. సరికొత్త రికార్డులు ఖాయమా?

టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. పలువురు స్టార్ల సినిమాలు రీరిలీజ్ అవుతూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ 'సింహాద్రి' సినిమా మళ్ళీ విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అలాగే మే 28న ఎన్టీఆర్ 'అడవి రాముడు', మే 31న కృష్ణ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' రీరిలీజ్ కానున్నాయి. ఇక వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ తన క్లాసిక్ ఫిల్మ్ తో మరోసారి సందడి చేయనున్నారు.

ఇప్పటికే పవన్ నటించిన పలు సినిమాలు మళ్ళీ విడుదలయ్యాయి. ముఖ్యంగా 'ఖుషి', 'జల్సా' సినిమాలు రీరిలీజ్ లో వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు పవన్ నటించిన మరో సినిమా మళ్ళీ థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది. పవన్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఫిల్మ్ 'తొలిప్రేమ'. 1998 జులైలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ప్రేమ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు కట్టిపడేశాయి. పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. అప్పట్లో యూత్ ఈ సినిమాకి ఫిదా అయిపోయారు. కేవలం పవన్ అభిమానులే కాకుండా, అందరూ మెచ్చేలా ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా అదే ఫీల్ ఇస్తుంది. అలాంటి సినిమాని 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మళ్ళీ విడుదల చేస్తున్నారు. జూన్ 30న ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పవన్ అభిమానులు మాత్రమే కాకుండా ఈ తరం యూత్ అంతా బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపే అవకాశముంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.