English | Telugu

తిరుపతిలో ఘనంగా 'ఆదిపురుష్' ప్రీరిలీజ్ ఈవెంట్!

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ విడుదల చేయనుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి, జై శ్రీరామ్ పాటకి విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారైంది.

'ఆదిపురుష్' ప్రీరిలీజ్ వేడుకను జూన్ 6న తిరుపతిలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ వేడుకకు మూవీ టీమ్ తో పాటు ఎవరైనా ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. సినిమా విడుదలకు పది రోజుల ముందే తిరుపతిలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తున్న మూవీ టీమ్.. ఆ తర్వాత హైదరాబాద్, ముంబై సహా ఇతర ప్రధాన నగరాల్లో పలు ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించే అవకాశముంది.

'ఆదిపురుష్' సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ప్రభాస్ ఆ ఫీట్ సాధిస్తాడేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.