English | Telugu

ఈ వారం సినిమా పండుగ.. థియేటర్, ఓటీటీ లిస్ట్...

సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు థియేటర్లలో ప్రదర్శితమవుతున్నాయి. అలాగే ఈ వారం పలు సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. జనవరి 24న గాంధీ తాత చెట్టు, ఐడెంటిటీ, హత్య, స్కై ఫోర్స్ (హిందీ), డియర్ కృష్ణ, తల్లి మనసు, హాంగ్ కాంగ్ వారియర్స్, రామాయణ ఇలా దాదాపు పది సినిమాలు థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. వీటిలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె నటించిన అవార్డు విన్నింగ్ సినిమా కావడంతో 'గాంధీ తాత చెట్టు' ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పలు సినిమాలు, సిరీస్ లు విడుదలవుతున్నాయి.

డిస్నీ+ హాట్ స్టార్:
బరోజ్ మూవీ - జనవరి 22
స్వీట్ డ్రీమ్స్ - జనవరి 24
కోల్డ్ ప్లే - జనవరి 26

అమెజాన్ ప్రైమ్:
ఫియర్ మూవీ - జనవరి 22
సివరపల్లి వెబ్ సిరీస్ - జనవరి 24

నెట్ ఫ్లిక్స్:
ది నైట్ ఏజెంట్ - జనవరి 23
ది శాండ్ క్యాసిల్ - జనవరి 24
ది ట్రామా కాల్ - జనవరి 24
పర్ఫెక్ట్ మ్యాచ్ - జనవరి 25
వెనమ్ లాస్ట్ డాన్స్ - జనవరి 25
ప్రే ఫర్ ది డెవిల్ - జనవరి 26

ఈటీవీ విన్:
వైఫ్‌ ఆఫ్‌ - జనవరి 23
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్- జనవరి 24

ఆహా:
రజాకార్ మూవీ - జనవరి 24

జీ5:
హిసాబ్ బరాబర్ - జనవరి 24
తిరు మాణికమ్ - జనవరి 24

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.