English | Telugu
తీన్ మార్ తొలిరోజు కలెక్షన్ 9.45 కోట్లు
Updated : Apr 15, 2011
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్ని చిత్రాల్లోకీ ఈ "తీన్ మార్" తొలిరోజు వసూలు చేసిన 9.45 కోట్లు ఏ చిత్రం వసూలు చేయలేదనీ, ఇది తెలుగు సినీ పరిశ్రజ్మలోనే ఒక రికార్డనీ గణేష్ అన్నారు. ఇది "మగధీర" చిత్రం తొలి రోజు వసూలు చేసిన కలెక్షన్ల కన్నా ఎక్కువని సినీ వర్గాలంటున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవలసి ఉంది. "మగధీర" విడుదల చేసిన థియేటర్ల కన్నా"తీన్ మార్" విడుదల చేసిన థియేటర్లు ఎక్కువ. అందువల్ల "మగధీర" తొలిరోజు కలెక్షన్లను ఈ "తీన్ మార్" మూవీ తొలిరోజు కలెక్షన్లతో పోల్చలేము.