English | Telugu
పవన్ కళ్యాణ్ తీన్ మార్ యు.యస్. కలెక్షన్స్1.75 cr
Updated : Apr 18, 2011
పవన్ కళ్యాణ్ "తీన్ మార్" యు.యస్. కలెక్షన్స్ 1.75 cr అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇది యు.యస్. వీకెండ్ ఆల్ టైమ్ తెలుగు సినిమా రికార్డని సమాచారం. పవన్ కళ్యాణ్ "తీన్ మార్" సినిమా మూడు లక్షల అరవై వేల డాలర్లు మొత్తం ముప్పై రెండు సెంటర్లలో వసూలు చేసిందట. అంటే మన లెక్క ప్రకారం కోటి డబ్భైలక్షలన్నమాట. ఇది బాలీవుడ్ సినిమాలు గతంలో వసూలు చేసిన మొత్తం కన్నా ఎక్కువని తెలిసింది. ప్రస్తుతం ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ రివ్యూలన్నీ బాగుండటంతో పాటు మౌత్ టాక్ మూలంగా కూడా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవరేంటో ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ మరోసారి నిరూపించింది. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీని చూసి ఇంతియాజ్ ఆలీ కూడా ప్రశంసించారు. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించారు. ఒక వేళ పైన మేమిచ్చిన లెక్కలు మీకు గనక తప్పనిపిస్తే సరైన కలెక్షన్స్ రిపోర్ట్ ని మీరు మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాము.