English | Telugu

రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడనుందా?..ఆ ఎఫెక్ట్ ఫలితమేనా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ఫస్ట్ టైం'ది రాజాసాబ్'(the raja saab)తో హర్రర్ కామెడీ జోనర్ ని టచ్ చేస్తున్న విషయం తెలిసిందే.ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23 న రిలీజైన ఫస్ట్ మోషన్ గ్లింప్స్ 'రాజా సాబ్' ఏ స్థాయిలో తెరకెక్కబోతుందో చెప్పకనే చెప్పింది.మరి ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ లుక్ ని చూసిన అభిమానులు,మూవీ లవర్స్ అయితే 'రాజా సాబ్' ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తే పరిస్థితి.

ఇక 'రాజా సాబ్' నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 10 న థియేటర్స్ లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు కూడా.దీంతో వేసవికి ప్రభాస్ హంగామా షురు అని అందరు అనుకున్నారు.కానీ ఇప్పుడు 'రాజాసాబ్' వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే రూమర్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల షూటింగ్ లో ప్రభాస్ కి కాలి కండ నరాలు పట్టేయ్యడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.ఈ విషయంలో ప్రభాస్ ని కొన్ని రోజుల పాటు డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారని, దాంతో షూటింగ్ లేట్ అయ్యేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఏప్రిల్ 10 న 'రాజాసాబ్' రాకపోవచ్చని అంటున్నారు.సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ రియాక్షన్ ఈ విధంగా ఉంటుందో చూడాలి.

'రాజాసాబ్' ని దర్శకుడు మారుతీ(maruthi)అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నాడు,తన కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా స్టార్ తో,పాన్ ఇండియా మూవీ చేస్తుండంతో, సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా తమ బ్యానర్ లో 'రాజాసాబ్' ఒక సూపర్ డూపర్ హిట్ గా నిలిచిపోతుందని ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది.నిధి అగర్వాల్(nidhhi agerwal)మాళవిక మోహనన్(malavika mohanan)హీరోయిన్లు గా చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అనే టాక్ కూడా ఉంది.థమన్(thaman)మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.