English | Telugu

రాజా సాబ్ ట్రైలర్.. ఏందిరా మీ బాధ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ది రాజా సాబ్'. పీపుల్ మీడియా నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మూడు నెలల ముందుగానే ట్రైలర్ ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. (The Raja Saab Trailer)

మూడున్నర నిమిషాల నిడివితో రూపొందిన 'ది రాజా సాబ్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పేరుకి హారర్ కామెడీ జానర్ అయినప్పటికీ.. ప్రభాస్ స్టార్డంకి తగ్గట్టుగా అడుగడుగునా భారీతనం కనిపిస్తోంది. అలాగే, ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించిన వింటేజ్ ప్రభాస్ కూడా ఇందులో కనిపిస్తున్నాడు.

కళ్ళు మూసుకో, డీప్ బ్రీత్ తీసుకో అంటూ ప్రభాస్ ని హిప్నటైజ్ చేసే విజువల్స్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ క్రమంలో హారర్ ఎఫెక్ట్ రాగా.. "చంపేశాడు బాబోయ్" అంటూ ప్రభాస్ అనడం సరదాగా ఉంది. అలాగే ట్రైలర్ లో చూపించిన రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి డార్లింగ్ రోజులను గుర్తు చేస్తాయి అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత హారర్ సీన్స్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రభాస్ నీటిలోనుంచి మొసలిని విసిరేసే షాట్ హైలైట్ గా నిలిచింది. కొన్ని విజువల్స్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉన్నాయి. ఇక ట్రైలర్ చివరిలో ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో కనిపించడం ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పవచ్చు. "ఏందిరా మీ బాధ. పుట్టలో చెయ్యి పెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా.. రాక్షసుడిని" అంటూ ప్రభాస్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ముగించిన తీరు అదిరిపోయింది. ఇక ట్రైలర్ తో విజువల్స్ తో పాటు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.

అలాగే, రాజా సాబ్ చిత్రాన్ని 2026 జనవరి 9 విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.