English | Telugu

రెండు ముఖాలు చూపిస్తున్న ఎన్టీఆర్.. దెబ్బ తింటాడా?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ అంచనాలను మరింత పెంచుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు, సినీ అభిమానులు.. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు 'దేవర' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ టీం అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది.

విడుదలకు ఇంకా నెలరోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో 'The Faces of Fear' పేరుతో తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ రెండు కోణాల్లో కనిపిస్తున్నాడు. ఒక లుక్ లో లాంగ్ హెయిర్ తో ఉండి, కూల్ గా చూస్తుండగా.. మరో లుక్ లో షార్ట్ హెయిర్ తో ఉండి, కోపంగా చూస్తున్నాడు. ఇలా ఎన్టీఆర్ రెండు రకాల ఫేస్ లతో రూపొందించిన ఈ పోస్టర్ క్రియేటివ్ గా ఉంది.

'దేవర'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడని వినికిడి. అందుకు తగ్గట్టే ఇప్పటిదాకా ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ లుక్ రెండు రకాలుగా ఉంది. ఇక ఇప్పుడు తాజా పోస్టర్ తో.. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని మరోసారి స్పష్టమైంది. కాగా ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా నటించిన 'ఆంధ్రావాలా', 'శక్తి' సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ఆ సెంటిమెంట్ ని దేవర బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'దేవర'లో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్, టీజర్ విడుదల కానున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.