English | Telugu

బన్నీ, త్రివిక్రమ్ సోషియో ఫాంటసీ ఫిల్మ్.. అంతకుమించి!

బన్నీ, త్రివిక్రమ్ సోషియో ఫాంటసీ ఫిల్మ్.. అంతకుమించి!

హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి చేతులు కలిపారు. వీరి కలయికలో వచ్చిన  'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా విజయం సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని సాధించి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. అలాంటి హిట్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది.

గురు పూర్ణిమ శుభ సందర్భంగా ఈరోజు(జూలై 3) బన్నీ-త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గత మూడు సినిమాలనూ నిర్మించిన హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థనే ప్రొడక్షన్ నెం.8 గా ఈ సినిమాని కూడా భారీ స్థాయిలో నిర్మించనుంది. గీతా ఆర్ట్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం కానుంది. ఈ చిత్రాన్ని పద్మశ్రీ అల్లు రామలింగయ్య మరియు శ్రీమతి మమత సమర్పణలో హారిక & హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'అల వైకుంఠపురములో' తర్వాత హారిక & హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ మరోసారి చేతులు కలపడం విశేషం.

ఈ సినిమాని ఈరోజు ఉదయం 10:08 గంటలకు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు. గత చిత్రాలను మించి అత్యంత భారీ స్థాయిలో అద్భుతమైన అనుభూతిని పంచే చిత్రాన్ని అందించబోతున్నామని వీడియో ద్వారా తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది. 

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'గుంటూరు కారం' చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప-2' చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక బన్నీ-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కనున్న నాలుగో సినిమా పట్టాలెక్కనుంది. కాగా ఇది పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ అని ఇన్ సైడ్ టాక్.

బన్నీ, త్రివిక్రమ్ సోషియో ఫాంటసీ ఫిల్మ్.. అంతకుమించి!