English | Telugu

తండేల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే..మేకర్స్ చెప్పింది ఎంత 

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)సాయి పల్లవి(Sai pallavi)జంటగా 'చందు మొండేటి'(Chandu Mondeti)దర్శకత్వంలో ఈ నెల 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'తండేల్'(Thandel).పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అన్నిచోట్ల మంచి ప్రేక్షకాదరణతో ముందుకు దూసుపోతుంది.దేవిశ్రీప్రసాద్(Devisriprasad) అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి హైలెట్ గా నిలిచాయి రీసెంట్ గా చిత్ర బృందం శ్రీకాకుళం లో సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించింది.

ఇక తండేల్ ఫస్ట్ వీక్ 90 .12 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది.ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారకంగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తండేల్ 100 కోట్ల రూపాయిల మార్కుని మరికొద్ది రోజుల్లోనే చేరుకోబోతుంది.ఈ నెలలో ఇంకో బడా హీరో సినిమా లేకపోవడం,పైగా ఈ శుక్రవారం విడుదలైన రెండు సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో 'తండేల్' రాబోయే రోజుల్లో మరిన్ని భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాకి చెందిన కొంత మంది మత్యకారుల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.