Read more!

English | Telugu

విజ‌య్‌కి ఈ సారి టైటిల్ క‌లిసొస్తుందా?

విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న సినిమా దళపతి 67. ఈ  పేరుతో మొన్న మొన్నటి వరకు వైర‌ల్‌ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు లియో అని పేరు పెట్టారు. ప్రోమో, బిజిఎం ఇంకో రేంజ్ లో ఉంది. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. లియో  బ్లడీ స్వీట్ అనే టైటిల్ య‌మా ఫాస్ట్ గా వైర‌ల్ అవుతోంది.

ఈ ఏడాది అక్టోబర్ 19న  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దళపతి 67 కొత్త షెడ్యూల్ కాశ్మీర్లో ప్రారంభం కానుంది. విజయ్ తో పాటు త్రిష కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. లోకేష్ కనకరాజ్‌ ఇప్పటికే క‌శ్మీర్‌ లొకేషన్ల‌లో రెక్కి నిర్వహించేశారు.

కాశ్మీర్ షెడ్యూల్ కి సంబంధించిన వీడియోలను కూడా అక్కడి నుంచి పంచుకుంటాన‌ని హింటిస్తున్నారు లోకేష్‌. ఇటీవల చెన్నైలో ఈ చిత్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్జున్, గౌతమ్ వాసుదేవ‌మీన‌న్‌, మిస్కిన్‌, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇంతకుముందు లోకేష్ కనకరాజ్‌, విజయ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాకు కూడా మాస్టర్ అని ఇంగ్లిష్  టైటిల్ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు లియో అనే పేరు పెడుతున్నారు. తమిళనాడులో సినిమాల‌కు తమిళ పేర్లు పెడితే ట్యాక్స్ ఎగ్జంప్ష‌న్‌ ఉంటుంది. కానీ, ప్యాన్ ఇండియా రేంజ్‌లో టైటిల్ జ‌నాల్లోకి వెళ్లాల‌ని, యూనిక్ టైటిల్ అయితే, భాష‌కో టైటిల్‌ని ఆలోచించే ప‌ని ఉండ‌ద‌ని అంటున్నారు లోకేష్‌. ట్యాక్స్  గురించి పట్టించుకోవట్లేదు విజయ్ టీం.