English | Telugu

వెంకటేష్ బాడీగార్డ్ రామానాయుడు స్టుడియోలో

వెంకటేష్ "బాడీగార్డ్" రామానాయుడు స్టుడియోలో శరవేగంగా జరుగుతూంది. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, అందాల త్రిష హీరోయిన్ గా, "డాన్ శీను" ఫేం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం "బాడీగార్డ్". మళయాళంలో సూపర్ హిట్టయిన "బాడీగార్డ్" అనే సినిమాని తమిళంలో విజయ్, ఆశిన్ జంటగా "కావలన్" (కాపలావాడు) పేరుతో నిర్మించగా ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది.

అదే సినిమాని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేస్తూండగా, తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారని వినికిడి. వెంకటేష్ "బాడీగార్డ్" సినిమాలో సలోనీ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తూంది. వెంకటేష్ "బాడీగార్డ్" సినిమా షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టుడియోలో జరుగుతూంది. ఈ వెంకటేష్ "బాడీగార్డ్" సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్ "బాడీగార్డ్" సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తూండగా, కోన వెంకట్ సంభాషణలు వ్రాస్తున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.