English | Telugu

నాగ్ ఢమరుకంలో అభిమన్యు సింగ్

నాగ్ "ఢమరుకం"లో అభిమన్యు సింగ్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా, అందాల యోగా టీచర్ అనుష్క, సీనియర్ హీరోయిన్లు స్నేహ, సిమ్రాన్ హీరోయిన్లుగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్‍ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం" ఢమరుకం". నాగ్ "ఢమరుకం" సినిమాలో బాలీవుడ్ నటుడు అభిమన్యు సింగ్ పామునుండి మనిషిగా మారే ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారని తెలిసింది.

ఈ అభిమన్యు సింగ్ గతంలో రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో వచ్చిన "రక్తచరిత్ర", పూరీ జగన్నాథ్ "నేను-నా రాక్షసి" సినిమాల్లో విలన్ గా చక్కని నటన ప్రదర్శించాడు. అభిమన్యు సింగ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "దూకుడు" సినిమాలోనూ, అలాగే వివేక్ కృష్ణ దర్శకత్వంలో, నాగచైతన్య హీరోగా నటిస్తున్న "బెజవాడ రౌడీలు" చిత్రంలోనూ విలన్ గా నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.