English | Telugu

అల్లు అర్జున్, ప్రభాస్ ల సినీ కెరీర్ గ్రాఫ్

అల్లు అర్జున్, ప్రభాస్ ల సినీ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందోనని ఫిలిం నగర్‍లో చర్చ జరుగుతూంటే ఇదేదో బావుందనిపించి మీకోసం వాళ్ళిద్దరి సినీ కేరీర్ గ్రాఫ్ ని అందిస్తున్నాం. ముందుగా వీళ్ళిద్దరూ సినీ కుటుంబాల నేపథ్యం నుండి వచ్చినవారే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాత ప్రముఖ నటులు స్వర్గీయ అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత, మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, బావ రామ్ చరణ్ ప్రముఖ హీరోలు. అలాగే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తండ్రి ప్రముఖ నిర్మాత, పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు. ఇక వాళ్ళిద్దరి సినీ కెరీర్ గ్రాఫ్ పై దృష్టి సారిస్తే.... ముందుగా అల్లు అర్జున్ నటించిన సినిమాలను చూద్దాం. గంగోత్రి సినిమా ద్వారా పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య, బన్నీ, దేశముదురు, హ్యాపీ, వేదం, వరుడు, ఆర్య-2 తదితర చిత్రాల్లో నటించాడు. వీటిలో వరుడు, ఆర్య-2 సినిమాలు అతన్ని నిరాశపరిచాయి. మిగిలిన సినిమాలు ఫరవాలేదనిపించాయి. దేశ ముదురు, ఆర్య, బన్నీ సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి.

మరి ప్రభాస్ విషయానికొస్తే ఈశ్వర్ సినిమాతో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. తర్వాత రాఘవేంద్ర, వర్షం, ఛత్రపతి, పౌర్ణమి, మున్నా, యోగి, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, బిల్లా, డార్లింగ్, ఇటీవల మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాల్లో నటించాడి ప్రభాస్. వీటిలో వర్షం సినిమా సూపర్ హిట్టయి ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ నిస్తే, ఛత్రపతి సినిమా చాలా పెద్ద హిట్టయి మాస్ హీరోగా అతని బాక్సాఫీస్ స్టామినాని నిరూపించింది.ఆ తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, బిల్లా చిత్రాలు నిరాశపరచినా, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలు హిట్టయి అతనికి ఊరటకలిగించాయి. అల్లు అర్జున్, ప్రభాస్ ఇద్దరూ చక్కని స్నేహితులనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.