English | Telugu

ఐటెం సాంగ్ వింటేనే గాని పిల్లలు అన్నం తినటం లేదు

రెండు దశాబ్డల నుంచి భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన అన్ని భాషల్లోను తన సత్తా చాటుతు వస్తున్న నటి 'తమన్నా'(Tamannaaah Bhatia). తెలుగులో కూడా అగ్ర హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ ని సొంతం చేసుకున్న తమన్నా, గత కొంత కాలంగా స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ చిత్ర విజయంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ ఏడాది మే నెలలో విడుదలైన 'అజయ్ దేవగన్ మూవీ 'రెయిడ్ పార్ట్ 2 'లోను స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

రీసెంట్ గా తమన్నా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఒక కొత్త సినిమాకి సంతకం చేసేటప్పుడు, దాని ద్వారా వచ్చే డబ్బు గురించి ఆలోచించను. నేను చేస్తున్న పని ప్రేక్షకులపై ఏ మేర ప్రభావం చూపిస్తుందని మాత్రమే ఆలోచిస్తాను. పాట, నటన, సినిమా ఇలా ఏదో ఒకటి ప్రేక్షకులని తాకడం నాకు ముఖ్యం. ఇటీవల చాలా మంది తల్లులు నాకు ఫోన్ చేసి 'ఆజ్ కి రాత్'(Aaj Ki Raat)పాట పెడితేనే మా పిల్లలు అన్నం తింటున్నారని చెప్పారు. ఈ విషయంలో భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పిల్లలకి సాహిత్యం అర్ధం కాదు. సంగీతం వింటూ ఎంజాయ్ చేస్తున్నారని తమన్నా చెప్పుకొచ్చింది.

తమన్నాపై చిత్రీకరించిన 'ఆజ్ కి రాత్' స్పెషల్ సాంగ్ హర్రర్ కామెడీ గా తెరకెక్కిన 'స్త్రీ 2 '(Stree 2)చిత్రంలోనిది. గత సంవత్సరం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. 'ఆజ్ కి రాత్' సాంగ్ వలన సక్సెస్ స్థాయి మరింతగా పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అంతలా ఆ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. 'సచిన్, జిగర్' (Sachin, Jigar)సంగీత ద్వయంలో ఆ సాంగ్ రూపొందగా, యూ ట్యూబ్ లో ఇప్పటి వరకు 738 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన స్త్రీ 2 800 కోట్ల వరకు వసూలు చేసింది. రాజ్ కుమార్ రావు(Rajkummar rao)శ్రద్ధ కపూర్(Shraddha kapoor)జంటగా నటించగా అమర్ కౌశిక్(Amar Kaushik)దర్శకత్వం వహించాడు.