English | Telugu
రాహుల్ సిప్లిగంజ్ కు రూ.కోటి నజరానా.. మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి!
Updated : Jul 20, 2025
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా.. రాహుల్ సిప్లిగంజ్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని సీఎం అన్నారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు రేవంత్. (Rahul Sipligunj)
పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ దాకా వెళ్లింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.