English | Telugu

నీ మొగుడికి చూపించుకో.. అనసూయ పై ఫైర్ 

-ఎప్పుడు ఈ గోల తగ్గుతుంది
- క్షమాపణ చెప్పాడు కదా
-నీ మొగుడు కి చూపించుకో
-బాధ్యతగా ఉండక్కర్లా


సినిమాకి సంబంధించి జరిగే పబ్లిక్ ఫంక్షన్స్ లో ఆడవాళ్లు ఎలాంటి వస్త్రాలు ధరించాలో చెప్పిన శివాజీ మాటలు పలు విమర్శలకి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో శివాజీ ఇప్పటికే క్షమాపణ చెప్పడమే కాకుండా తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరై ఉద్దేశపూర్వకంగా అనలేదని చెప్పడంతో పాటు తన పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఆ వ్యాఖ్యలపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ మాత్రం సోషల్ మీడియా వేదికగా శివాజీపై పలు రీతుల్లో విమర్శలు చేసుకుంటూ వస్తూనే ఉంది.

ఇప్పుడు ఈ మొత్తం విషయంపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యా రెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతు ఒక మహిళగా, భారతీయ స్త్రీగా, తెలంగాణ ఆడబిడ్డగా మాట్లాడుతున్నాను. శివాజీ చేసిన వ్యాఖ్యల్లో రెండు పదాలు తప్పుగా ఉన్నాయి. ఈ విషయాన్ని శివాజీ అంగీకరించి క్షమాపణ చెప్పాడు. కానీ తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా అనసూయ అయన్ని టార్గెట్ చేస్తు విమర్శించడం సరికాదు. శివాజీ గారు ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. అయినా అనసూయ ఓవరాక్షన్‌తో వీడియోలు, పోస్టులు చేసి వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇప్పుడు అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై మాట్లాడుతున్నాను.

Also read: జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శరీరంలో భారీ మార్పులు.. నాన్ వెజ్ వల్లేనా!


ఆడది తన అందాన్ని ఇంట్లో మొగుడికి చూపిస్తే చాలు. బజారులో మగాళ్లందరికీ చూపించనక్కర్లేదు. స్వేచ్ఛ అంటే బట్టలకే పరిమితం కాదు. చదువు, ఉద్యోగం, అభిప్రాయం చెప్పే హక్కు ఇవే నిజమైన స్వేచ్ఛ. పబ్లిక్ ప్లేసుల్లో మహిళలు, పురుషులు కొంత బాధ్యతతో ప్రవర్తించాలి. స్వేచ్ఛ పేరుతో సమాజాన్ని రెచ్చగొట్టడం సరికాదు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో ఓ హీరోయిన్ తాను ధరించిన డ్రస్సింగ్ వల్ల ఇబ్బందికర పరిస్థితిలని ఎదుర్కొంది. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే శివాజీ ఒక అన్నగా, తమ్ముడిగా సలహా ఇచ్చాడని సంధ్య రెడ్డి పేర్కొంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .