English | Telugu
16 సంవత్సరాల లోపు పిల్లలకి అనుమతి
Updated : Mar 1, 2025
వయసుతో సంబంధం లేకుండా మల్టిప్లెక్స్ లో సినిమా చూడటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.మల్టి ప్లెక్స్ లో మూవీ చూస్తే వచ్చే మజా వేరని చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం.కాకపోతే 16 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం అన్ని షోస్ కి మల్టి ప్లెక్స్ లోకి అనుమతి లేదు.
కానీ రీసెంట్ గా 16 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా అన్నీ షో లకు అనుమతించాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులుని సవరించి హైకోర్టు ఈ తీర్పుని ప్రకటించింది.కాకపోతే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు మాత్రం అనుమతిని నిరాకరించిన కోర్టు,కేసు తదుపరి విచారణ మార్చి 17 కి వాయిదా వేసింది.
