English | Telugu

పవన్ కళ్యాణ్ తీన్ మార్ రిలీజ్ విశేషాలు

పవన్ కళ్యాణ్ "తీన్ మార్" రిలీజ్ విశేషాలు చాలానే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "తీన్ మార్". ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" రిలీజ్ విశేషాల విషయానికొస్తే ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1150 థియేటర్లలో విడుదల కాబోతూంది. నైజాంలో 200 లకు పైగా థియేటర్లలో విడుదలవుతుంది. ఒక్క హైదరాబాద్ లోనే 60 కి పైగా థియేటర్లలో విడుదల కాబోతూంది. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ మల్టిప్లెక్స్ థియేటర్లలోవిడుదలైన తొలి రోజే 30 షోస్ ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్"మూవీని వేస్తున్నారు.

దిల్ షుక్ నగర్ లో ఇప్పటి వరకూ ఏ సినిమా అయినా నాలుగు థియేటర్లలోనే విడుదల కాగా, ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ మాత్రం అయిదు థియేటర్లలో విడుదల కాబోతుంది. తొలి రోజు 8 కోట్లకు పైగా షేర్ వస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" సినిమా రిలీజ్ కు ఇన్ని విశేషాలున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ గనక ఏ మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకున్నా, తెలుగు సినీ పరిశ్రమలో చాలా రికార్డులు తుడిచిపెట్టుకు పోవటం ఖాయం అని సినీ వర్గాలంటున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.