English | Telugu

నాగార్జున 'N' కన్వెన్షన్ ని టచ్ చేసారు.. మరి లోయర్, మిడిల్ క్లాస్ ఓట్లు పోతాయి కదా!

తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) ఒకప్పుడు రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలని ప్రేక్షకులకి అందించి తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.ప్రెజంట్ యూ ట్యూబ్ లో వచ్చే పలు ఇంటర్వూస్ లో పాల్గొంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తుంటారు. రీసెంట్ గా నాగ్ 'N' కన్వెన్షన్ కూల్చివేతపై తన అభిప్రాయాన్ని వెల్లడి చేసాడు.

రేవంత్ రెడ్డి (Revanth Reddy)గవర్నమెంట్ తుమ్మిడి చెరువు దగ్గా ఉన్న 'N' కన్వెన్షన్ ని కూల్చేయాలనుకుంది కూల్చారు. నాగార్జున 'N' కన్వెన్షన్ ల్యాండ్ ని కొనుక్కున్నాడు. నిజానికి ఆ స్థలం మొత్తం పన్నెండు ఎకరాలు. అందులో మూడు ఎకరాలు కబ్జా చేసారని గవర్నమెంట్ కూల్చింది. మరి అది ఎంత వరకు నిజమో తెలియదు. కాకపోతే రూల్స్ ప్రకారం చెరువు ఒడ్డున కొంత ప్లేస్ వదిలేయాలి. నాగార్జున అలా చేయలేదనే ఉద్దేశ్యంలో కూడా కూల్చేసి ఉండవచ్చు.వాటర్ బాడీ కాబట్టి నాగార్జున ఓన్ ప్లేస్ అయినా సరే కట్టడానికి వీల్లేదని చెప్పుకొచ్చాడు.

ఇక అసలు హైడ్రా (hydra)అనేది ఓన్లీ ఎఫ్ టి ఎల్ ల్యాండ్ మీద చేస్తుందా లేక పర్మిషన్ లేని ఇళ్ళ మీద కూడా కూల్చివేతలని చేస్తుందా! కానీ ఒక్కటి మాత్రం నిజం ఎఫ్ టి ఎల్ కిందనే అన్ని చేస్తే సగం హైదరాబాద్ పగలు కొట్టాల్సిందే అని చెప్పుకొచ్చాడు. బడా బాబులు నుంచి రాజకీయనాయకుల పిల్లల దాకా అలాగే సామాన్యులు తో పాటు ఎన్నో కాలనీలు కూడా ఎఫ్ డి ఏ కిందకి వస్తాయి. అలా చేస్తే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఓట్లు పోతాయి. అందుకే వాటి జోలికి వెళ్లరని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.