English | Telugu
'మత్తు వదలరా-2' వచ్చేస్తోంది.. ఈసారి డబుల్ డోస్!
Updated : Aug 26, 2024
ఈమధ్య కుర్ర హీరోల సినిమాల సీక్వెల్స్ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. దానికి ఉదాహరణగా 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్'ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో కుర్ర హీరో నటించిన సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. (Mathu Vadalara 2)
శ్రీ సింహా హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మత్తు వదలరా'. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ థ్రిల్లర్ 2019 డిసెంబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో, అంతలా థ్రిల్ పంచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'మత్తు వదలరా-2' వస్తోంది. సైలెంట్ గా ఈ సీక్వెల్ కి పూర్తి చేసిన మేకర్స్.. తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్స్ ను వదిలారు. ఈసారి ఫన్, థ్రిల్ అన్నీ డబుల్ డోస్ లో ఉంటాయని మేకర్స్ పేర్కొన్నారు. అదే నిజమైతే.. 'టిల్లు స్క్వేర్' తరహాలో 'మత్తు వదలరా-2' కూడా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసే అవకాశముంది.