English | Telugu

రెండో ప్రియుడికి తమన్నా గుడ్ బై చెప్పిందా! లేక మూడో ప్రియుడా!

తమన్నా(Tamannaah Bhatia)హీరోయిన్ గా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో ఐటెం సాంగ్స్ ద్వారా కూడా అంతే పేరు సంపాదించింది అసలు తమన్నా ఒక ఐటెం సాంగ్ చేసిందంటే, ఆ సినిమా హిట్ అవ్వడమే కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనే నానుడి కూడా ప్రేక్షకుల్లో ఏర్పడింది. తాజాగా తమన్నాకి సంబంధించిన పర్సనల్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

తమన్నా ప్రముఖ హిందీ నటుడు విజయ్ వర్మ(vijay varma)ప్రేమలో ఉందన్న సంగతి అందరకి తెలిసిందే. ఈ విషయాన్నీ బహిరంగంగానే ప్రకటించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటామని ఇద్దరు చెప్పారు. దీంతో అభిమానులు పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్న టైం లో తమన్నా చెప్పిన కొన్ని విషయాలతో అందరిలో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న తమన్నా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇప్పటి వరకు నా హృదయం రెండుసార్లు ముక్కలయ్యింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే కారణం వల్ల ఫస్ట్ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నాను.

కానీ నాకు అతను సెట్ కాదనిపించింది. ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్పే వాళ్లంటే నాకు నచ్చదు. నేను రిలేషన్ ఉన్న వ్యక్తి కూడా అలాంటి వాడని తెలియడంతో కొంత కాలానికి బ్రేకప్ చెప్పానని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ తమన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తమన్నా కామెంట్స్ చేసింది విజయ్ వర్మ గురించేనా లేక విజయ్ వర్మ తన మూడో హృదయమా అనే విషయం మీద కూడా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.