English | Telugu
మా ఆయన మొహం చూళ్లేదంటున్న స్వాతి
Updated : Oct 20, 2014
తెలుగు పిల్ల స్వాతి ఇప్పుడు అనుదినం వార్తల్లో ఉంటోంది. సినిమాలెక్కువై కాదు. ఆమెపై పుకార్లు పెరిగి. ఓ యువ హీరోతో బాగా సన్నిహితంగా ఉంటోందని, త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ హీరో ఎవరో కాదు. నిఖిల్. స్వామి రారాతో ఇద్దరూ తెరపై కనిపించారు. ఇప్పుడు కార్తికేయలోనూ ఈ జోడీనే చూడబోతున్నాం. వరుసగా రెండు సినిమాల్లో నటించేశారు కదా.. అందుకే ఈ రకం వార్తలు వరుస కడుతున్నాయి. వాటిపై స్పందించింది స్వాతి. ''స్వాతి పెళ్లి చేసుకొంటోందోచ్.. అనే వార్తలు నేనూ విని షాకైపోయా. అసలు నాకు కాబోయే భర్త మొహం నేనే చూళ్లేదు. మీడియావాళ్లు మాత్రం కథలు, కూరలు వండేస్తున్నారు..' అంటూ తనదైన స్టైల్‌లో నవ్వేసింది స్వాతి. మరి ఈ వార్తల్లో నిజం లేదా...?? అని అడిగితే ''ఏమాత్రం లేదు. నేను ఎవరి ప్రేమలో పడలేదు. ఇంట్లోవాళ్లు కూడా పెళ్లి ఊసెత్తడం లేదు. ఇక నిఖిల్ మ్యాటరంటారా...?? మేమిద్దరం కలసి రెండు సినిమాలు చేశాం. అంతకంటే కారణం ఏం కావాలి? ఇద్దరూ ఓసారి రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం కూడా చేశాం. అందుకే ఈ పుకారు పుట్టుంటుంది'' అంటోంది స్వాతి.