English | Telugu

టాలీవుడ్ లో 'గూండాగిరి': దాసరి సంచలనం

తెలుగు సినీ దర్శక రత్న దాసరి నారాయణ రావు టాలీవుడ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాలు ఆడనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కొంతమంది తమ సినిమాలే చూడాలన్నట్లుగా గూండాగిరి చేస్తున్నారని అన్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి నీచమైన పరిస్థితి తాను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమకు చెందిన కొంతమందికి ప్రతిభ లేకపోయినా ముఖాల్ని చెక్కి చెక్కి పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ‘లక్ష్మీ రావే మాయింటికి’ అనే సినిమా ఫంక్షన్ లో అతిధిగా పాల్గొన్న దాసరి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. అయితే దాసరి ఎవరిని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.