English | Telugu
‘అంజాన్’గా వస్తున్న సూర్య
Updated : Jun 23, 2014
సూర్య అభిమానులకు శుభవార్త. సూర్య తదుపరి చిత్రం ‘అంజాన్’ విడుదలకు సిద్ధం అవుతోంది. దక్షిణాదీ అంతటా పాపులారీటి వున్న హీరోలు కొందరే. అందులో ఎక్కువ క్రేజ్ వున్న యంగ్ హీరో సూర్య. సూర్య చిత్రాలకు తమళంతో పాటు తెలుగులోను క్రేజ్ ఎక్కువే. అందుకే సూర్య నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులో డబ్ అవుతుంటాయి. లేటెస్టుగా సూర్య నటించిన ‘అంజాన్’ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం తోపాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో తిరుపతి బ్రదర్స్, యు టీవీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో లగడపాటి శిరీష, శ్రీధర్, లింగుస్వామి ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ రాజా అందిస్తున్నారు. సంతోష్ శివన్ కెమెరా ఈ చిత్రానికి హైలెట్ కానుంది.