English | Telugu
నలుగురు మృతి.. సన్నీలియోన్‌కి నో పర్మిషన్!
Updated : Jun 13, 2024
నటి సన్నీ లియోన్ దేంట్లో స్పెషలిస్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడామె ఆ స్పెషలిస్టు పనులు చేయకుండా, చక్కగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ టైమ్ పాస్ చేస్తోంది. అడపాదడపా పలు ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహిస్తూ నాలుగు డబ్బులు వెనకేసుకోవడంతోపాటు కుర్రకారుకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. అయితే సన్నీ లియోన్ లేటెస్ట్.గా కేరళలోని తిరువనంతపురం యూనివర్సిటీ క్యాంపస్‌లో తన ఈవెంట్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని అనుకుని సదరు యూనివర్సిటీ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంది. అయితే నీ ప్రదర్శనకు అనుమతి ఇవ్వం బాబోయ్ అని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఎందుకంటే, గత సంవత్సరం కేరళలోనే వున్న ఎర్నాకుళం జిల్లాలోని కొచ్చిన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సన్నీ లియోన్ పాల్గొంది.
సన్నీ లియోన్ వస్తుందంటే పరిస్థితి ఎలా వుంటుంది? స్టూడెంట్ కుర్రాళ్ళు వేల సంఖ్యలో లొట్టలేసుకుంటూ వచ్చేశారు. వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసరికి భారీగా తొక్కిసలాట జరిగింది. నలుగురు కుర్రాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. దాంతో సన్నీ లియోన్ ప్రదర్శన అంటేనే కుర్రాళ్ళు కాదుగానీ, పెద్దోళ్ళు భయపడిపోతున్నారు. సన్నీ లియోన్ ఇచ్చే ‘ప్రదర్శన’ సంగతి దేవుడెరుగు.. కుర్రాళ్ళు అన్యాయంగా దేవుడి దగ్గరకి వెళ్ళిపోతారని భయపడుతున్నారు. అందుకే తిరువనంతపురం యూనివర్సీటీ వైస్ ఛాన్సలర్ సన్నీ లియోన్ ప్రదర్శనకు నో చెప్పేశారు.