English | Telugu
నెంబర్ ఇస్తాను బూతులు తిడతారా
Updated : Jun 13, 2024
రంగస్థలం తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన నటుడు అజయ్ ఘోష్(ajay ghosh)ఇక పుష్ప తో స్టార్ నటుడుగా మారాడు. దర్శకులు తన కోసమే పాత్రల్ని సృష్టించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బిజీ ఆర్టిస్ట్ లో కూడా ఒకడు.ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తి అనే మూవీతో వస్తున్నాడు. హీరోగా చేస్తున్నాడని అనుకోవచ్చు. తాజాగా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా అందరు కలిసి చూడాల్సిన మూవీ. మీ అందర్నీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇందులోని ఎమోషన్స్ అందరికీ నచ్చుతాయి. చిన్న సినిమాకదా అని అనుకోకండి. మంచి కంటెంట్ ఉంది. అదే విధంగా థియేటర్లలోనే చూడండి. ఒకవేళ మూవీ మీకు నచ్చకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి బూతులు తిట్టవచ్చని అజయ్ ఘోష్ చెప్పాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కలర్ ఫోటో చాందిని చౌదరి(chandini chowdary)హీరోయిన్ గా చేస్తుంది.
శివ పాలడుగు డైరెక్టర్ కాగా పవన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు. జూన్ 14న రిలీజ్ అవుతుంది.మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.సత్య కిషోర్ భత్సు నిర్మాత.